మేడ్చల్: ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి
ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ హిల్స్ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. కాలనీలో 93 లక్షలతో సిసి రోడ్లు 7 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను ఏఈ రాజకుమార్ కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొందర్లోనే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పైపు లైన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.