నిర్మల్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం లో శుక్రవారం శుభ ముహూర్తం ఉండడంతో పాటు, త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో, చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండె కాకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చి అమ్మవారి పాదాల వద్ద అక్షరాభ్యాసం పూజలు చేస్తున్నారు. భక్తులతో అక్షరాభ్యాస మండపం కిక్కిరిసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు..