నరసన్నపేట: నరసన్నపేట ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బంది 689 మందికి శిక్షణనిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ కొనసాగింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఎలా వినియోగించాలి అనేది డీఆర్పీలు వివరించారు. పోలింగ్ సిబ్బంది ఏ విధంగా పనిచేయాలి.. ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలనేది వివరించారు. ఉదయం ఆర్వో రామ్మోహన్ రావు శిక్షణను ప్రారంభించారు.