పూడి గ్రామంలో ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
పూడిలో విషాదం.. ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి పూడి గ్రామంలోని కొత్త హరిజనవాడకు చెందిన బత్తయ్య అనే వ్యవసాయ కూలీ ( డ్రైవర్) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం స్వర్ణముఖి నది సమీపంలోని తాళ్లూరు వద్ద పంట పొలాల్లో ట్రాక్టర్ దున్నుతుండగా ట్రాక్టర్ అడుసు దిగబడి పోయింది. ట్రాక్టర్ని బయటికి తీసే క్రమంలో ట్రాక్టర్ హఠాత్తుగా వెనుకకు తిరగబడింది. డ్రైవర్ బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.