భూపాలపల్లి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం, వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనగా వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన శనివారం రాత్రి 7:30 సమయంలో భూపాలపల్లి పట్టణ శివారు బొగ్గుల వాగు సమీపంలో చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. భూపాలపల్లి మండలంలోని ఆజాద్ నగర్ గ్రామానికి చెందిన మాంత రాజేశం అనే వ్యక్తి పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఆజాద్ నగర్ వెళుతుండగా మార్గమధ్యలో ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో గాయాలయ్యాయి. ఈమెరకు ప్రమాద పరిస్థితిని పోలీసులు పరిశీలించారు.