వనపర్తి: సెప్టెంబర్ 17న వనపర్తి జిల్లాలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో ప్రజా పాలన వేడుకలపై జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.