నాయుడుపేటలో పల్లెవెలుగు బస్సులో పొగలు
- భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో వాకాడు డిపో కి చెందిన కోట - నాయుడుపేట సర్వీస్ బస్సు నుండి తుమ్మూరు పాత ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు నిలిపి పొగలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాని డ్రైవర్ గాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం వర్షాకాలం కావడంతో బస్సు బ్రేక్ లైనింగ్ లు బురదతో నిండిపోవడంతో బ్రేకులు నుండి పొగలు వచ్చాయని డ్రైవర్ చెప్తున్నారు.