ఎచ్చెర్ల: రోగులకు సకాలంలో వైద్యం అందాలి
: సీతంపేట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
రోగులకు సకాలంలో వైద్యం అందాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డెక్కన్ కంపెనీ సిఎస్ఆర్ లో ఇచ్చిన సి ఆర్ మీ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సకాలంలో ఉత్తమ సేవలు అందాలన్నారు. ఆస్పత్రుల పర్యటించి రోగులతో మాట్లాడి అందుతున్న సేవలుపై ఆరా తీశారు. స్కానింగ్ కు మహిళకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.