ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో హజరత్ మహమ్మద్ వలి గంధ మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మూడు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైసిపి విద్యుత్ ప్రభ ఫై డాన్స్ తో అలరించడానికి వస్తున్నానని నెల్లూరు కవిత తెలిపారు. గుంటూరు వెన్నెల ఈవెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయాలని కోరారు.