ప్రకాశం జిల్లా పెద్దారవీడు ఎస్సై సాంబశివయ్య జూద క్రీడలను సహించేది లేదని మండల ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. కోడి పందాలు లేదా పేకాట ఎక్కడ మండలంలో ఆడుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు డయల్ 100 ద్వారా ప్రజలు సమాచారం ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఎస్ఐ సాంబశివయ ఇటీవల పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులకు తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోడిపందాలు పేకాట ఆడుతున్న వారి సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.