సంగారెడ్డి: బస్సులో దొరికిన 39 తులాల బంగారాన్ని అందజేసిన ప్రయాణికుడు, ప్రయాణికుడిని సన్మానించిన సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్
సంగారెడ్డి డిపో బస్సులో ఈరోజు మధ్యాహ్నం సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ వసుధ ప్రకాష్ భార్యాభర్తలు జూబ్లీ బస్టాండ్ నుండి సంగారెడ్డికి వస్తుండగా వారి వద్దనున్న 49. 29 లక్షల విలువగల 39 తులాల బిస్కెట్ బంగారం కూర్చున్న సీట్లో పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న కొరంపల్లి కి చెందిన సిహెచ్ దుర్గయ్య అనే ప్యాసింజర్ ఆ పర్సును బస్సు కండక్టర్ కు అందజేశారు దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు అతని నిజాయితీని మానవత్వాన్ని గౌరవిస్తూ సంగారెడ్డి డిపోలో డిపో మేనేజర్ ఉపేందర్ ఘనంగా సన్మానించారు.