భీమవరం: జిల్లాలో భారీ వర్షం, జలమయమైన రహదారులు
పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. పాలకొల్లు, భీమవరం, వీరవాసరం పట్టణాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జాతీయ రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.