జగిత్యాల: కాయ్ రాజా.. కాయ్ అంటూ,150 రూ.కొట్టు, దసరా పండుగకు మందూ, పొట్టేలు పట్టు : సారంగాపూర్ లో దసరా పండక్కి బంపర్ బొనాంజ ఆఫర్
జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో సాయిని తిరుపతి అనే వ్యక్తి పండగకు పది రోజుల ముందే వెరైటీ ఆఫర్ ను ప్రజల ముందు ఉంచాడు.పండుగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్స్ అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి.అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక తెలంగాణలో అయితే దసరా పండుగ అంటే చుక్క ,ముక్క ఆకిక్కే వేరు అన్నట్లుగా సెలబ్రేషన్స్ ఉంటాయి.150 రూపాయల టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా పండుగ రోజు తీసే లక్కీ డ్రా లో 5 బంపర్ బోనంజా బహుమతులను ప్రకటించేసాడు.ఇంతకీ అవేమిటంటే...