జనగాం: నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి నియోజకవర్గ సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజల ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.జనగామ పట్టణంలోని రైల్వే బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచేందుకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కబ్రస్తాన్ నిర్వహణ చేపట్టాలన్నారు వ్యవసాయ మార్కెట్ రోడ్డు కి దగ్గరగా వర్షపు నీరు వెళ్లే విధంగా రోడ్డు డ్యామ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.