జాతీయ లోక్ అదాలత్ లో 854 కేసులు పరిష్కారం అయినట్లు పీలేరు సీనియర్ సివిల్ కోర్టు చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి ఎ.మహేష్ శనివారం సాయంత్రం తెలిపారు. మొదటి బెంచ్ లో 11వ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ అధ్యక్షతన మోటార్ వాహన కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా తదితర 8కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.రెండవ బెంచ్ లో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జియావుద్దీన్ షేక్ అధ్యక్షతన సివిల్, క్రిమినల్, ఎక్సైజ్ తదితర 85 కేసులను పరిష్కరించారు. అదే విధంగా 761ఇతర కేసులను పరిష్కరించగా 63,85,489రూపాయలు పరిష్కారం అయ్యిందన్నారు.