అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి మండలం మొలకచర్ల లోని అర్థరాత్రి దున్నపోతు బలిచి క్షుద్ర పూజలు
నల్లగొండ జిల్లాలోని సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ సందర్భంగా వీడియో మంగళవారం సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అడవిదేవులపల్లి మండలం మొలక చర్ల లోని మైసమ్మ గుడి ముందు కొందరు ముగ్గులు వేసి దున్నపోతును బలి ఇచ్చి నిప్పు పెట్టి కాల్చారు. 7 దిక్కులో ఇనుప మేకులు కొట్టి పసుపు కుంకుమ వేసిన కుండలు పగలకొట్టారు స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. గుప్త నిధుల కోసమా లేదా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.