పండగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జెసి మాట్లాడుతూ... సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా వేడుకలు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదు అన్నారు.