అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై రాప్తాడు రామినేపల్లి అమల మధ్యలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పర్వత దేవరపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.