పి ఫోర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ మార్గదర్శకుల ను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Mar 30, 2026
షేరింగ్, కేరింగ్ లక్షణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ ( పీ - 4 ) కార్యక్రమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయడంలో ఉత్తమ మార్గదర్శకులుగా ఎంపిక అయిన వారిని సోమవారం ప్రకాశం భవనంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పరంగా సమాజంలో టాప్ -10 స్థానంలో ఉన్నవారు, పేదరికంతో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి వెన్నుదన్నుగా నిలిచేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించినట్లు చెప్పారు.