గూడూరు వన్ టౌన్ ఎస్ఐగా మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు
Gudur, Tirupati | Oct 21, 2025 గూడూరు వన్ టౌన్ ఎస్ఐఐగా మనోజ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టిసారిస్తానన్నారు. నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, నిషేధిత మత్తు పదార్ధాలను అరికడతానన్నారు.