రాయికోడ్: మండలంలో భారీ వర్షాలకి మత్తడి దూకుతున్న బొగ్గులపల్లి ప్రాజెక్ట్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రాయికోడ్ మండలంలో బొగులపల్లి ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం నుంచి ప్రాజెక్టు మాత్రమే దిగువకు దూకుతుంది.వాన కాలంలో ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా పొంగిపొర్లడంతో స్థానిక ప్రజలు తిలకిస్తున్నారు. రైకోడ్ ఎస్సై చైతన్య కిరణ్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు.ఈ పరిసరాల్లో ప్రజలుద్దని అవగాహన చేస్తూ అప్రమతి చర్యలు చేపట్టారు.