గంగాధర నెల్లూరు: SRపురం పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ
SRపురంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఐ సుమన్ సిబ్బందితో కలిసి ఆయుధ పూజను నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా దీపావళి నిర్వహించాలని తెలిపారు.