సంగారెడ్డి: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి అని కోరుతూ సంగారెడ్డిలో యూఎస్ఎఫ్ఐ ధర్నా
పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలని కోరుతూ యూఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులు మంగళవారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రియంబర్స్ మెంట్ చెల్లించకపోవడం దారుణమని అన్నారు.