విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర పట్టణానికి చేరుకుంది
శ్రీకాళహస్తికి చేరుకున్న బస్సు యాత్ర విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సోమవారం శ్రీకాళహస్తికి చేరుకుంది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు యాత్ర 13వ రోజున శ్రీకాళహస్తికి విచ్చేసింది. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని AISF నాయకులు విమర్శించారు. రూ.6400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో జాప్యం చేస్తుందన్నారు.