దర్శి: గంగవరం గ్రామంలో మట్టి ప్రమిదలకు పెరిగిన మంచి గిరాకీ
Darsi, Prakasam | Oct 20, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా కుమ్మర వ్యాపారస్తులు మట్టి ప్రమిదలు అమ్మకాలు జరుపుతున్నారు కార్తీక మాసం పూర్తయ్య వరకు వీటికి మంచి గిరాకీ ఉంటుంది దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు భారీగా కొనుగోలు చేశారు వీటి వలన ఇంటికి పర్యావరణ పరిరక్షణకు మంచిదని స్థానికులు తెలిపారు.