వనపర్తి: ఖిల్లా ఘనపూర్:ఘన లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ ఘనలింగేశ్వర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో అర్చన అభిషేకాలు అఖండ భజనలు చేస్తూ భక్తి తన్మయత్వం తో మునిగిపోయారు.మూసాపేట మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల లక్ష్మి నర్సిములు ఆన్లైన్లో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.