పాన్‌గల్: కొత్తకోట మండల కేంద్రంలో భారత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించారు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెసు పార్టీ తరఫున ఘన నివాళి అర్పించారు. శుక్రవారం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మార్కెట్ యార్డు చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రదాన మంత్రి గా మన్మోహన్ సింగ్ ఎనలేని సేవలు అందించాడని, భారత్ ఆర్థిక సంక్షోభ కాలంలో ఆర్థిక మంత్రి గా సంస్కరణలు తీసుకువచ్చి, అనంతరం భారత ప్రధాని గా మన్మోహన్ సింగ్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడని తెలిపారు.