అదిలాబాద్ అర్బన్: సైబర్ నేరానికి గురైన ఓ బాధితుడికి 10 రోజుల్లో తిరిగి డబ్బులు అందేలా ఎస్పీ కృషి..ఎస్పీని శాలువాతో సత్కరించి బాధితుడు
సైబర్ నేరానికి గురైన ఓ బాధితుడికి 10 రోజుల్లో తిరిగి డబ్బులు అందేలా ఎస్పీ అఖిల్ మహాజన్ చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎస్పీని శాలువాతో సత్కరించి బాధితుడు కృతజ్ఞతలు తెలియజేశారు.పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన సునీల్ సైబర్ మోసానికి గురవగా, ఎస్పీ ఆదేశాల మేరకు కడప సైబర్ సెల్ ద్వారా అతనికి తిరిగి రూ.41,800 అందేలా చర్యలు తీసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.