వనపర్తి: ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలను దోచుకుంటున్న కాంట్రాక్టర్లన్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్
సోమవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాల అవకతవకలపై వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ జీతాల అవకతవకలపై సాక్షాదారాలతో సహా ప్రజావానిల్లో కలెక్టర్ ఫిర్యాదు చేశామని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు తదితరులు ఉన్నారు.