సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నందు భద్రత తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ను జిల్లా ఎస్పీ నర్సింహ బుధవారం ఆకస్మికంగా సందర్శించి భద్రత నిఘాను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బ్యాంకు సిబ్బందికి రక్షణపరమైన సూచనలను భద్రత ఏర్పాట్లపై సలహాలు అందించారు. ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవస్థ ఉద్యోగులు కృషి చేయాలని ప్రజల యొక్క ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగానికి పాల్పడకూడదని సూచించారు. ప్రజలు వారి యొక్క ఆస్తులను ఎంతో నమ్మకంతో బ్యాంకులో దాచుకుంటారని వాటికి సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులపై ఉందన్నారు.