నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా నాయకులు హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకుల రాకతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు.