వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ అహ్మద్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీంతో అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.