తాడేపల్లిగూడెం: కర్నూలు ఉల్లినే వినియోగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, రైతులకు లాభదాయకమైన ధరను అందించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్
తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్‌సేల్ ఉల్లి మార్కెట్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా ఆదివారం సాయంకాలం 6 గంటలకు పరిశీలించారు. కడప, కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయల ఆక్షన్‌లో ధరలు తక్కువగా ఉండటంతో వ్యాపారస్తులతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ యార్డులు, రైతు బజార్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉల్లి కొనుగోలు పెరిగితే రైతులకు ఊరట లభిస్తుందని తెలిపారు. పరిశీలనలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, మార్కెట్ యార్డ్ డిప్యూటీ డైరెక్టర్ పాపారావు, మార్కెటింగ్ ఏడి సునీల్ కుమార్ పాల్గొన్నారు.