కోరుట్ల: కోరుట్ల పట్టణంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించిన విద్యార్థులు ఉపాధ్యాయులు
చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలలందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ... జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు విద్యార్తునులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థునులు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.