గుంతకల్లు: ధర్మాపురంలో టపాసులు పేలుస్తూ గాయాల పాలైన బాలుడు వరుణ్
గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన రంగనాథ్ కుమారుడు వరుణ్ టపాసులు పేలుస్తూ గాయాలపాలయ్యాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. వరుణ్ స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇంటిలో ఉన్న టపాసులు తీసుకొని పేల్చడానికి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు చేతి పై పడ్డాయి. దీంతో వరుణ్ గాయపడ్డాడు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు.