నారాయణ్‌ఖేడ్: మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరు: నారాయణఖేడ్‌లో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆయన ఖేడ్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టినట్లు తెలిపారు. రజకులు ఏకతాటిపై ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం కులాలను రాజకీయానికి వాడుకుందని విమర్శించారు.