మంచిర్యాల: రైతులకు అవసరమైన మేరకు యూరియా పంపిణి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం భీమారం మండల కేంద్రంలో గల రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సుధాకర్ తో కలిసి రైతులతో మాట్లాడారు. వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భీమారం మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా మండలంలో అవసరం ఉన్న ప్రకారం 3, 4 రోజులలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.