ఆందోల్: షాపూర్ వద్ద గుంతలమయమైన రోడ్డును పూర్తిచేసిన గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, రాయికోడ్ మండలం, మెటల్ కుంట నుండి అల్లదుగ్గు వరకు 30 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, షాపూర్ గ్రామానికి చెందిన అంబు పటేల్, గాయత్రి షుగర్ కంపెనీ సహకారంతో తమ సొంత నిధులతో రోడ్డు గుంతలను పూడ్చివేశారు. స్థానిక ప్రజలు, వాహనదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు