పూతలపట్టు: కానిపాకం దేవస్థానంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం రుచి పరిశీలించిన ఈవో ఈవో పెంచల కిషోర్
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ శనివారం మధ్యాహ్నం దేవస్థానం నిత్య అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. భక్తులతో పాటు దేవస్థాన అధికారులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులను అడిగి అన్నప్రసాద రుచి, నాణ్యత గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి అన్నప్రసాద భవన నిర్వహణ, పరిశుభ్రత, భక్తులకు అందించే సేవలపై సిబ్బందిని సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈవోలు ఎస్.వి. కృష్ణారెడ్డి, ధనంజయ, రవీంద్రబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.