కాకినాడ బీచ్ ధ్వంసం మరమ్మతులు చేయాలి ప్రయాణికులు
కాకినాడ సముద్రం తుఫాన్ వల్ల కాకినాడ బీచ్ రోడ్డు కొన్నిచోట్ల ధ్వంసం అయింది. కొత్తపట్నం వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో సముద్రానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానికులు అధికారులు బండరాలతో ప్రయత్నాలు ప్రారంభించారు గ్రామంలో నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో సముద్రంలోకి పంపిస్తున్నారు. కొత్తపట్నం కోలుకోలేని దెబ్బతిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.