భీమవరం: విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రైల్వే జంక్షన్లో ఘనంగా ఇంజినీరింగ్ డే
నేటి ఆధునిక యుగంలో రోజుకో కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తున్నాయంటే అందులో ఇంజినీర్ల పాత్ర ఎనలేనిదని పలువురు వక్తలు అన్నారు. భీమవరం రైల్వే జంక్షన్లో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంకాలం 6 గంటలకు ఇంజినీరింగ్ డే ను నిర్వహించారు. ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనంతరం ఆరుగురు రైల్వే ఇంజనీరులను సత్కరించారు.