నల్గొండ: నల్లగొండ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ సిటీ జలమయం
నల్లగొండ పట్టణంలోని శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ సిటీ జలమయం అయింది . ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం ఓల్డ్ సిటీలోని మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండ్లలోకి వరద నీరు చేరగా డ్రైనేజీలు పొంగిపొయినాయి దీంతో స్థానికులు ఆందోళన చెంధారు.