రాయదుర్గం: దర్గాహొన్నూర్ లో ఘనంగా ఉరుసు ఉత్సవాలు, పోలీసు సేవలు భేష్
బొమ్మనహాల్ మండలంలోని దర్గాహోన్నూర్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి చక్కెర చదివింపులకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దర్గా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. దర్గా వద్ద రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు చిన్నారులు తల్లిదండ్రుల నుంచి తప్పిపోగా వారిని వెంటనే గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.