నల్గొండ: నల్లగొండలో డివైడర్ బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
నల్లగొండ జిల్లా: నల్లగొండ దేవరకొండ రోడ్డులో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం డివైడర్ను బైక్ ఢీకొట్టడంతో నవీన్ యాదవ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు వంశీ రెడ్డికి సీరియస్ గా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు .మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తును చేపట్టారు.