భూపాలపల్లి: పంటలకు సరిపడా యూరియా అందివ్వాలి పిఎసిఎస్ కార్యాలయం ముందు చెప్పులతో క్యూ లైన్ : చెల్పూర్ గ్రామ రైతులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామ రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి చెల్పూర్ పిఎసిఎస్ కార్యాలయం ముందు క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వేచి చూస్తున్నట్లు రైతులు మంగళవారం ఉదయం ఏడు గంటలకు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వం సరిపడా యూరియా అందివ్వకపోవడంతో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతున్నట్లు రైతులు తెలిపారు.