సంగారెడ్డి: భూభారతి పెండింగ్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల 50 నిమిషాలకు ఆర్డీవోలు తాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తాగు లేకుండా వెంట వెంట అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదా బైనమా పిఓటిలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరిపి క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించాలని తెలిపారు.