రాజానగరం: నిడదవోలులో టిడిపి, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల రగడ :టిడిపి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆగ్రహం
నిడదవోలు కూటమిలోటీడీపీ,జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల రగడ సోమవారం సాయంత్రం మొదలైంది ఈనెల 17న రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్ జన్మదిన పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆదేశాల మేరకు పట్టణంలో మంత్రి దుర్గేష్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవర్ బ్రిడ్జి పై ఉన్న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ టిడిపి ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తొలగించడంతో కూటమి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టిడిపి పట్టణాధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టారు.