కోరుట్ల: మెట్పల్లి పట్టణానికి చెందిన అలీమ్ అనే యువకుడు చికిట పొందుతూ పోరాడి మృతి చెందాడు
జగిత్యాల మృత్యువుతో పోరాడి వ్యక్తి మృతి మెట్ పల్లి పట్టణంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని అలీం అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి అలీం మృతి చెందాడు. మృతునికి ఒక పాప, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.