బాన్సువాడ: బరంగేడిగిలో వ్యక్తిపై కుక్కల దాడి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
బీర్కూరు మండలంలోని బరంగేడ్గి గ్రామంలో గురువారం ఉదయం 10.30 గంటల కు ఒక వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేశాయి . ఇంటి వద్ద ఉన్న చైనాపురం కామప్పపై కుక్కల గుంపు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి బాధితుడిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విపరీతంగా కుక్కలు పెరిగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.