అమీర్పేట: భర్త చేసిన దాడిలో గాయపడిన గర్భిణీని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించిన ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్
కొండాపూర్ లో గర్భిణీ అయిన భార్యను భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది ఆమెను ఎంఐఎం ఎమ్మెల్సీ మీడియా బేగ్ రెహమత్ సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన భర్త పై కేసు నమోదు చేసినట్లు అన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్సీ సూచించారు.